Sunday, December 18, 2011

నింగినిదుర

మెత్తగా మబ్బుకుచ్చుల ఉయ్యాల  
మత్తుగా రాతిరమ్మ గాలిజోల   
చనువుగా చందమామ
ను కావలించుకుని
అనువుగా చుక్కలదుప్పటి కప్పుకుని
ఉరుకున పగలు కాచి, అలసి ఆదమరచి
పడమరకు ఒత్తిగిలి, పడుకుంది ఆకాశం
తూర్పు పొద్దొచ్చి ముద్దిచ్చినా లేవనంటూ
తుళ్ళి తుళ్ళి రవికాంతులు గిల్లినా లేవనంటూ
                                                                    ---------వంశీ

6 comments:

సుభ/subha said...

Wooow...Very nice !

వంశీ కృష్ణ said...

thank you subha garu!

రసజ్ఞ said...

మల్లెల్లాంటి అక్షరాలను మరువం లాంటి అందమయిన భావాలతో కలిపి కవిత అనే మాలని భలే కడతారండీ మీరు!

జ్యోతిర్మయి said...

బహుశా పక్షుల ప్రభాత గీతానికి లేస్తుందేమో..

వంశీ కృష్ణ said...

రసజ్ఞ గారు
మల్లె-మరువం, అందమైన ఉపమానం! మీ 'పొగడ'పూలకి థాంక్యూలు

వంశీ కృష్ణ said...

జ్యోతిర్మయి గారు,
నాలాగె నా నింగిది మొద్దు నిద్రండీ బాబూ
గువ్వల కువకువలకి కూడా లేవదు :P :P

Post a Comment