Friday, December 9, 2011

ఉదయహృదయం

రాతిరంతా కురిసిన మంచుమాటున దాగి దాగి
శరత్కాలపు లేతఎండలో రెక్కలారిన గువ్వకూనా,
నీ గుండెనూరి గొంతుదారి
పాట ఒకటి పరుగులెత్త
స్పందన పొందిన ఉదయహృదయం,
శ్వాసకిపుడు సరిగమల స్నానం!

ఏరికోరి చెంతచేరి
గాలిగంతులు వంతపాడ
మాటై చిగురించదా ప్రతిమౌనం,
కువకువల రాగాన పుట్టదా మరో ప్రపంచం !!
                                                                 -----------వంశీ



4 comments:

రసజ్ఞ said...

గాలిగంతులు వంతపాడ
మాటై చిగురించదా ప్రతిమౌనం బాగుందండీ! మీరు చక్కని భావాన్ని బహు చక్కగా అందిస్తారు. మీ మరో ప్రపంచం తప్పక పుడుతుంది వంశీ గారూ!

వంశీ కృష్ణ said...

మీ అభిమానానికి ధన్యవాదాలు రసజ్ఞ గారూ

abhilash said...

Née udaya hrudayaaniki spurthi , prerana enti?
Tampa lo Manchu padadu kada :P

వంశీ కృష్ణ said...

ప్రేరణ అంటూ ప్రత్యేకంగా ఏం లేదు లేవోయ్
చటుక్కున మెరిసిన ఓ ఆలోచన అంతే...

Post a Comment