Sunday, November 13, 2011

ఇంకెవరు నాకు ఇనకులతిలకా

ఇంకెవరు నాకు ఇనకులతిలకా
ఇసుమంత నీకీ దీనుపై దయరాక   

1: కాల్చివేయు జన్మతాపమున
కలి మాయలు తాళ తరమేనా 
కరుణ కలుగు తరుణము కాదనా   
మరణపు శరణము తప్పించ  ||ఇంకెవరు నాకు ఇనకులతిలకా||

2: బ్రతుకును నీకే కైంకర్యము చేతు    
చితికిన మతికి గతి నీవని తలతు 
సాంత్వనగూర్చు నీ నామకీర్తనజేతు
రాతితనమున చేతన కలిగించ  ||ఇంకెవరు నాకు ఇనకులతిలకా||
                                                                                                       ---------వంశీ

1 comments:

Disp Name said...

వంశీ,

చేతనా చేతన ఇచ్చేవాడు వెంకన్న మీ ఇనకుల తిలకుడు దీనులపై దయ జూప వచ్చు ను provided దీనుడు , పుత్ర వాత్సల్యముతో 'తండ్రీ' నీవే తప్ప నితః పరంబెరుగ నని గజేంద్రుని వలె శరణాగతి నొందిన.

Post a Comment