Tuesday, October 18, 2011

గుండెగుబులు

నీ మనసుపూల భావగంధం మరిగి 
నా తుమ్మెద ఎదకు గుబులైనపుడు,   
వేదనలో వేచిన కాలాలు కరిగి
జన్మంత దూరం దగ్గరైనపుడు,  
ఒంటరితనపు చీకటినిశి తరిగి    
ప్రేమోషస్సు ముంగిట వెలిగినపుడు,           
ఇంకా లేనిపోని దాగుడుమూతలాడి...      
నువ్వే నిండిన గుండెను నిప్పులకొండ చేయకు     

చల్లార్చను కంటివాన సరిపోదు!
నీ మీదే ప్రాణం పెట్టుకున్న ప్రాణాన్ని మెలిపెట్టకు
చిక్కబట్టను ఓపిక ఇకలేదు! 
                                            ------------వంశీ

2 comments:

రసజ్ఞ said...

నిండుగుండెను నిప్పులకొండ చేయకు
చల్లార్చను కంటివాన సరిపోదు! ఎంతో బాగుంది!

వంశీ కృష్ణ said...

thank u రసజ్ఞ garu!

Post a Comment