Monday, October 3, 2011

పరమీవె పరమపురుషా

పరమీవె పరమేశ పరమపురుషా  
వరచరణాలకిదె ఆత్మ నీరాజనం      

నెలవంక సిగమల్లికగా  
జలగంగ జడలనొదగగ
నాగులు నగలుగ నాట్యము సలుపగ
గళమున గరళపు గరిమవు నీవెగ
గైకొన
వయ ఘన నీరాజనం!    |పరమీవె పరమేశ| 

ప్రమదగణాలనువర్తనసేయ 
అలతిలయల పదనర్తనరాయ
ఓంకారబింబ త్రిలోకవందనీయ 
రుద్రస్థలనిలయ గిరిజామనోదయా   
ఉగ్రతాండవ అగ్రదేవయ  
అగ్నిలోచన అందుకోవయ
పంచప్రాణాల నీరాజనం!    |పరమీవె పరమేశ|

                                                                                                                                       -------------  వంశీ

2 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

vamsee..chaalaa goppagaa undi. It's your own?

వంశీ కృష్ణ said...

థాంక్యూ వనజ గారు! అవును నేనే రాసాను, ఎందుకలా అడిగారు! ఈ రొజు ఇంకొన్ని మార్పులు కూడా చేసాను, గమనించగలరు!

Post a Comment