Wednesday, December 3, 2014

అజుడు వీడు అజాండనాయకుడు
అనిలజగురుడు అనుపమ సుందరుడు
అవనిజవరుడు అఖిలాంతరంగుడు
అలమేలుపతియై అలరారుతున్నాడు!

ప్రసన్నవదనుడు ప్రశాంతచిత్త పావనుడు
ప్రసూనహృదయుడు ప్రబలపాప వినాశకుడు
ప్రసాదవరదుడు ప్రసారవర ప్రభాకరుడు
ప్రసాతిదేవుడు అప్రతిప్రభా పరాక్రముడు ||అజుడు వీడు||

పాలమున్నీట పవళించినాడు ఏడేడుజగములనేలేటివాడు
వలరాజుకన్నా సొగసైనవాడు వెయ్యారు భామల చేపట్టినాడు
కలిదనుజుల కబళించువాడు వేవేలకోర్కెలనీడేర్చుతాడు
వెలలేని వేదసారమ్ముతోడు వేల్పులందరుకూడి నుతించువాడు
కలిములెన్నో కలిగించువాడు ఏడుగిరులకొలువై శ్రీ వేంకటేశుడు ||అజుడు వీడు||
                                                                                           -----వంశీ

0 comments:

Post a Comment