నీటివీణ మీటుతూ నీలిమబ్బు కరిగితే...
ఒళ్ళో వాలే చినుకు చిలకలు,
కురిసి కురిసి కన్నెవాగై ఉరికే...
వానగొంతులో జారే ఎన్ని పాటలు,
తడిమి తడిమి
లేత చివురులతో చెప్పే ఎన్ని మాటలు,
తడిసి తడిసి పూసే కొమ్మల్లో
పుట్టే ఎన్ని పులకలు,
ఎండుటాకై పలవరించే భూమి ఎడద మీద...
పచ్చికయ్యే పరవశానికే ఆ చిలిపి చిందులు! -------------వంశీ
3 comments:
చాలా బావుందండీ
బావుందండీ!!
thank u very much!
Post a Comment