Wednesday, January 9, 2013

చింతతీరునా ఎంత పొగిలినా!

చింతతీరునా ఎంత పొగిలినా నీ
చింతనలేని అంతరాత్మకు అంతర్యామీ

పసలేని ప్రాణాలు పైపై పాపాలు
దెసలేదు తెన్నులేదు నువుగాక ఊరట
కొసలేని వాంఛలట కొన ఉసురుదాట
అసియై తెగనరుకు నీ నిర్మలనామమట  |చింతతీరునా|

వింతాటల కొలువట ఈ జీవనమంతా
ఎంతని ఓర్తుము కోరి నీ కొనచూపు తగిలింత |చింతతీరునా|

వరుస జన్మలట తెగని దురిత కర్మములట
దురిణుడవై వారించువీవే మాయా మర్మమట |చింతతీరునా|
                                                                         -------వంశీ

0 comments:

Post a Comment