Wednesday, June 13, 2012

మదనతూణీరం!

క్షణమో తీరు ప్రకృతికన్య పయనాన...
తన కనుగవ సారించి చూసెనా,
నేలమదిని మొలిచే వేల మదనతూణీరాలు!
పెదిమల సైగను పిలిచెనా,
చినుకులు గొంతెత్తిన మేఘమల్హారాలు!
చెంగు చెంగున పొంగులెత్తెనా,

చేతనాత్మక చేనులై గంగచెంగులు!
ఎండావానల చీరకుచ్చిళ్ళు కదిలెనా,
వర్ణరంజితాలై వ్యాపించు ఇంద్రచాపాలు!
పంటిపువ్వులై నవ్వు రాల్చెనా,
ఉషాశైలము కన్న తూరుపుశోభలు!
గగనపుతెరలపై సంజకుంచెలా పారాడెనా,
మూగప్రేమకు సంకేతాల్లా సాగరసమీరాలు!
శారదరాత్రుల పూర్ణిమై వాలెనా,
కలువల ముద్దులిడు చంద్రమయూఖాలు!                                    
                                         --------వంశీ



4 comments:

రసజ్ఞ said...

వావ్! చాలా బాగుందండీ! మీరు వాడే పదాలు భావానికి మరింత అందాన్ని చేకూరుస్తాయి.

శ్రీ said...

బాగుంది వంశీ గారూ!
భావానికి పోటీ వచ్చే పదాలు..
@శ్రీ

వంశీ కృష్ణ said...

thanks రసజ్ఞ gaaru! mee blog choosaandee...
chaala bavundi, teerika chesukuni anni chadavaali :)

వంశీ కృష్ణ said...

మీ అభినందనకు ధన్యవాదాలు శ్రీ గారు!

Post a Comment