Thursday, May 31, 2012

నీకు నువ్వే

కలతలు కొన్ని, వెలుతులు కొన్ని
నవ్వులు కొన్ని, ఏడ్పులు కొన్ని
పంచిన నిన్నలన్నీ పాడుబడనీ
కదిలే గమ్యమైనా కదలిక సాగనీ
చిన్న చింతలేని బతుకెందుకని
వెనుదీయక నడచిపో మున్ముందుకని
చెల్లాచెదురైన గుండె తునకల్ని ప్రేమతో పేర్చుకుంటూ
నిన్నలు దాటి నలుపులు చిమ్మిన రాత్రుల్ని చీల్చుకుంటూ
ఉదయపుకొసల మీద వెలుతురు పిట్టల్ని వేటాడుకుంటూ
ఒంటరిగా ఓరిమి సముద్రాన ఓటమిని ముంచేసుకుంటూ
రాసుకునే విజయగీతానికి స్వరాలు కూర్చుకుంటూ
చిగురంత ఆశల చిట్టి ప్రపంచాల్ని పుట్టించుకుంటూ
నీకు నువ్వే...నీకు నువ్వే....నీకు నువ్వే!
                                                      -----------వంశీ


4 comments:

బాలకృష్ణా రెడ్డి said...

'పంచిన నిన్నలన్నీ పాడుబడనీ '
రాత్రుల్ని చీల్చుకొంటు ......
ఉదయపు కోసల మిద ...''ఇలా
మంచి కవిత్వాన్ని అందించారు
కలత చెందిన మనిషికి కర్తవ్య బోధ చేసారు
అభినందనలు

వంశీ కృష్ణ said...

thank you Balakrishna garu!

భాస్కర్ కె said...

చిగురంత ఆశల
చిట్టి ప్రపంచాల్ని పుట్టించుకుంటూ
నీకు నువ్వే...
నీకు నువ్వే....నీకు నువ్వే!
bhaaga raasaarandi meeru

వంశీ కృష్ణ said...

thanx andi...

Post a Comment