గుర్తులంటే ఎదను గుచ్చే గుండుసూదులని తెలియలేదు!
కంటివాన కురుస్తున్నా గుండెమంటలారలేదు
కలతనిదుర కమ్ముతున్నా కలల బరువు తీరలేదు
చావులేని ఆశలున్నా, మూగఊసులు మూగుతున్నా
మగతైన మరపుకు ఒక బ్రతుకు చాలదు!
మనసులేని మనసుపై మనసుపడ్డ మనసు మనసులో లేదు!
------వంశీ
నా ఎద నదిలో కదిలే భావహారం... మౌనం మాటలు నేర్చే నా బృందావనం... ఇది నా మనసు వేణువై పలికే...'వంశీరవం'!
2 comments:
"మనసులేని మనసుపై మనసుపడ్డ మనసు మనసులో లేదు" చాలాబాగుందండి!
thank you padma garu!
Post a Comment